ముథోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 6 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ సుధాకర్ కోరారు. అర్హులైన విద్యార్థులు దోస్త్ వెబ్సైట్ లో 15 నుంచి 27 దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ముథోల్ కళాశాలలో బీఏ, బీఎస్సీ కంప్యూ టర్స్, బీఎస్సీ ఫిజికల్సైన్స్, బీఎస్సీ లైఫ్సెన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.