ప్రయాణ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆర్టీసీ అధికారులు

79చూసినవారు
ప్రయాణ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆర్టీసీ అధికారులు
కుభీర్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో చిన్న పాటి వర్షానికే బురదమయం అవుతుందని సిమెంట్ ఫ్లోరింగ్ పనులు చేయాలని ఇటీవల గ్రామస్థులు భైంసా డిపో మేనేజరుకు వినతి పత్రం అందజేశారు. కాగా శుక్రవారం భైంసా డీపో నుంచి విలేజ్ బస్సు ఆఫీసర్ సుధాకర్ కుభీర్ బస్టాండను పరిశీలనకు వచ్చారు. బస్టాండ్ ప్రాంగణంను పరిశీలించి నివేదిస్తామని తెలిపారు. ఆయన వెంట గ్రామస్థులు, ప్రయాణికులున్నారు.

సంబంధిత పోస్ట్