నిర్మల్ బస్టాండ్ లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి

59చూసినవారు
నిర్మల్ బస్టాండ్ లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ సోమవారం తెలిపారు. 60 నుండి 65 సంవత్సరాల వృద్ధుడు బస్టాండ్ లో స్పృహ తప్పి పడిపోయి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పట్టణ సీఐ 8712659511 మొబైల్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్