రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ

52చూసినవారు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎస్పీ జానకి షర్మిల పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు పోలీసుశాఖపై గురుతర బాధ్యత ఉందని అన్నారు. ఇందులో భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్