నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం నడిమితాండ గ్రామంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. తండాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.