ఆసుపత్రిలో చేరిన కియారా అద్వానీ
బాలీవుడ్ నటి కియారా అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.గురైనారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం చేరారు. రామ్చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో ఆమె నటించారు. ఏపీలోని రాజమండ్రి వద్ద వేమగిరిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం జరగనుంది. అయితే ఆసుపత్రిలో చేరడం వల్ల ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరు కాలేకపోతోంది. కియారా అనారోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.