పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ

85చూసినవారు
పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ
మోస్రా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో గురువారం గణేష్ మండపాల శాంతి కమిటీ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రుద్రూర్ సీఐ జయశ్ రెడ్డి, వర్ని ఎస్సై కృష్ణ కుమార్ మాట్లాడుతూ గణేష్ మండపాలకు అనుమతిని తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళలో మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. నిమజ్జనం బాధ్యత నిర్వాహకులది అన్నారు.