ధర్పల్లిలో ఘనంగా ఉగాది వేడుకలు

81చూసినవారు
ధర్పల్లిలో ఘనంగా ఉగాది వేడుకలు
ధర్పల్లిలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి, ఉగాది సందర్భంగా తయారు చేసిన పచ్చడిని ప్రజలందరికీ పంపిణీ చేశారు. ఒకరి కొకరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు శ్రీ కృష్ణ కోలాటం వేయడం జరుగుతుంది. ఈ వేడుకను చూడడానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు.

సంబంధిత పోస్ట్