నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ ను, నర్సింగ్ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఉన్నారు.