ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ సీఎం భార్య నామినేషన్ (వీడియో)

560చూసినవారు
జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్ భార్య కల్పనా సొరేన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె తాజాగా గాండే అసెంబ్లీ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా( జేఎంఎం) అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. సీఎం చంపాయ్ సోరెన్, మంత్రి బాదల్ పత్రలేఖ్, మిథిలేష్ ఠాకూర్, అలంగీర్ ఆలంలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు మే 20న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
Job Suitcase

Jobs near you