మనీలాండరింగ్‌ కేసులో లాలూ, తేజస్వి యాదవ్‌లకు నోటీసులు

82చూసినవారు
మనీలాండరింగ్‌ కేసులో లాలూ, తేజస్వి యాదవ్‌లకు నోటీసులు
మనీలాండరింగ్‌ కేసులో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో జరిగిన భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్‌ స్కామ్ కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది. ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ప్రతాప్ యాదవ్‌, మరికొందరికి కూడా నోటీసులు పంపింది. అక్టోబరు 7వ తేదీ లోపు తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్