తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలోని రాజ్సుఖ్ కాలనీ మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను జేసీబీ సాయంతో నేలమట్టం చేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.