ఓయూలో సర్క్యులర్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. సర్క్యులర్ వాపసు తీసుకోవాలని, విద్యా సమస్యలను పరిష్కరించాలని, బడ్జెట్ పెంచాలని కోరారు. ఓయూ క్యాంపస్ డెమోక్రసీ కాపాడటానికి ఓయూ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.