కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో కీలకమైన రాములోరి కళ్యాణం రేపు జరుగనుంది. రేపు సా.6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవం కోసం టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పౌర్ణమి రాత్రి పండు వెన్నెల్లో ఒంటిమిట్ట రాముల వారికి కళ్యాణం జరగడం ప్రత్యేకత.