ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం

80చూసినవారు
ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం
ఇస్లామాబాద్‌కు రావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ) సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)కు చెందిన ఇతర నేతలను పాక్ ఆహ్వానించింది. కాగా, పాక్‌తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి మోదీ సిద్ధంగా లేరని సంబంధింత వర్గాల సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్