ఐదు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్

3652చూసినవారు
ఐదు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ఐదు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా వేసిన 36.1 ఓవర్‌కు తయ్యబ్ తాహిర్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాగా, 33వ ఓవర్లో అక్షర్‌ పటేల్ వేసిన మూడవ బంతికి రిజ్వాన్ బౌల్డ్ అయ్యాడు. వెంటనే హార్దిక పాండ్య వేసిన ఓవర్ లో సౌద్ షకీల్ (62; 76 బంతుల్లో) ఔటయ్యాడు. ప్రస్తుతం పాక్ స్కోర్ 36.1 ఓవర్లకు 165/5 గా ఉంది.

సంబంధిత పోస్ట్