ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ మూడో వికెట్ కోల్పోయింది. పాక్ కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో46 పరుగులు చేసి అక్షర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 33వ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన మూడవ బంతికి రిజ్వాన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో షకీల్, రిజ్వాన్ 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం పాక్ స్కోర్ 34 ఓవర్లకి 154/3 గా ఉంది.