చిలుక జోస్యం చెప్పి అరెస్ట్ అయ్యాడు (వీడియో)

5298చూసినవారు
తమిళనాడులోని కడలూరులో తాజాగా ఒక జ్యోతిష్కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న PMK అభ్యర్థి తంగర్ బచ్చన్ ఎన్నికల్లో గెలుస్తాడని ఆ వ్యక్తి చిలుక సాయంతో జోస్యం చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించారు. చిలుకను పంజరంలో బంధించినందున జ్యోతిష్కుడిని, అతని సోదరుడిని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడిచి పెట్టారు.

సంబంధిత పోస్ట్