నేటి నుంచి పవన్ ఆధ్యాత్మిక పర్యటన.. ప్రధాన వ్యూహం అదేనా!

75చూసినవారు
నేటి నుంచి పవన్ ఆధ్యాత్మిక పర్యటన.. ప్రధాన వ్యూహం అదేనా!
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు వెళ్తుండగా.. ఈ టూర్ వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా రాజకీయాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ, BJP తరఫున హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకే ఆయన టూర్ అని చర్చ మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ తరుపున సత్తా చాటాలని పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం ఉంది. దీని వెనుక బీజేపీ ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్