ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. DHSకు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించనున్నట్లు తెలుస్తోంది.