అమెరికాలో కూలిన విమానం, ముగ్గురు మృతి (వీడియో)

2897చూసినవారు
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. పోర్ట్‌ల్యాండ్‌కు తూర్పు ప్రాంతంలో ఉన్న ఫెయిప్యూ నగరంలోని టౌన్ హౌస్ ప్రాంతంలో ట్విన్-ఇంజిన్ సెస్నా 421C అనే చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అకస్మాత్తుగా ఇళ్లపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్