బొప్పాయి పంటను సాగు చేసే రైతులు సస్యరక్షణ చర్యల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే బొప్పాయి సాగులో మంచి దిగుబడుడులు పొందటమేకాదు, లాభాలు తీయ్యవచ్చు. ఇక బొప్పాయి సాగులో వర్షాకాలం కాండం కుళ్లు తెగులు బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు పరిష్కారానికి మొక్క మొదల్లో నీరు నిల్వకుండా చూడాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.