మధ్యప్రదేశ్‌లోని ఛత్తాపూర్‌లో ఉన్న బాగేశ్వర్‌ధామ్ బాలాజీ టెంపుల్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొద్దిసేపట్లో ఆయన ఛత్తాపూర్‌లో క్యాన్సర్ చికిత్సకు ఉద్దేశించిన బాగేశ్వర్‌ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. దాదాపు రూ.200 కోట్లతో నిర్మించే ఈ ఆస్పత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న పేదవారికి ఉచిత చికిత్స అందించనున్నారు.