హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో ఉన్న వివిధ పబ్బుల్లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్ సాయంతో సోదాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి.