నెలనెలా ఆదాయాన్ని ఆశించేవారు, సురక్షిత పెట్టుబడుల పట్ల ఆసక్తి గల వారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీం (POMIS)ను పరిశీలించవచ్చు. ఈ పథకం ఆకర్షణీయ వడ్డీ రేటును అందిస్తోంది. అక్టోబర్-డిసెంబర్‌కు 7.40 శాతం వడ్డీ రేటు వస్తుంది. ఇతర చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్ల మాదిరిగానే ఈ POMI స్కీం వడ్డీ రేటును కూడా మూడు నెలలకోసారి సవరిస్తారు. ఇక ఈ పథకం కచ్చితమైన రాబడులను మదుపరులకు అందిస్తుంది.