ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్‌

54చూసినవారు
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్‌
నీటి కటకట, తీవ్రమైన వడగాల్పులతో ఉక్కిరిబిక్కిఅవుతున్న దేశ రాజధాని ఢిల్లీకి మరో సంక్షోభం ఎదురైంది. మంగళవారం మధ్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 1500 మెగావాట్ల విద్యుత్‌ను అందించే యుపిలోని మండోలా పవర్‌ గ్రిడ్‌లో అగ్ని ప్రమాదంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు ఆప్‌ విద్యుత్‌ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్