లంపీస్కిన్ వ్యాధిని తగ్గించేందుకు మేకలు, గొర్రెలకు వాడే గోట్ పాక్స్ వాక్సిన్ 80 నుండి 90 శాతం పశువులకు రక్షణ కల్పిస్తోంది. 3.0 మి.లీ వాక్సిన్‌ను చర్మం కిందకు మందలో కనీసం 90 శాతానికి తగ్గకుండా ఆరోగ్యంగా కనిపించే పశువులకు ప్రతి ఏటా వాడాలి. వ్యాధిని గుర్తించిన వెంటనే పశువులను వేరు చేసి దూరంగా తరలించాలి. పశువుల పాకలు, పరిసరాలను ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచి కీటకాలు వృద్ధి చెందకుండా జాగ్రత్త వహించాలి.