స్కూల్‌కి టిఫిన్‌లో నాన్‌వెజ్‌ తెచ్చిందని నర్సరీ చిన్నారిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ (వీడియో)

52చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ అమ్రోహాలోని శుక్రవారం ఒక ప్రైవేట్ పాఠశాలలో టిఫిన్‌ బాక్స్‌లో నాన్ వెజ్ ఫుడ్ తీసుకొచ్చిందని నర్సరీ చిన్నారిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. దీంతో చిన్నారి తల్లికి.. ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘స్కూల్‌కి నాన్‌వెజ్‌ తెచ్చే పిల్లలకు మంచి విలువలు నేర్పడం మాకు ఇష్టం లేదు’ అని ప్రిన్సిపాల్ అన్నారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్