జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025 అనే బిరుదుతోపాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జాతీయవేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.