4న శ్రీహరికోట నుంచి PSLV-C59 రాకెట్ ప్రయోగం

61చూసినవారు
4న శ్రీహరికోట నుంచి PSLV-C59 రాకెట్ ప్రయోగం
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 4న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C59 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాటు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన రెండు ఉపగ్రహాలను పంపించనుంది. సూర్యుడి బాహ్య వాతావరణం పై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్