ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని గురువారం తెరవనున్నారు. ఇందుకోసం ఉ.9:51 నుంచి మ.12:15 వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈనెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి, వీడియోగ్రఫీ చేయించినట్లు అధికారులు తెలిపారు. రేపు రహస్య గదిలోని సంపదను మరో స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారు. అనంతరం భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు.