‘పుష్ప2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో వాయువేగంతో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1,508 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం అంటూ పోస్టర్ విడుదల చేసింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రాల జాబాతాలో ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ (రూ.2,024 కోట్లు) టాప్‌లో ఉంది. హిందీలో రూ.618.50 కోట్లు (నెట్) వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.