ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ రూ. 270 - 280 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ రూ.100 కోట్లకు పైగానే అందుకున్నట్టు సమాచారం. రష్మిక రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.8 కోట్లు, శ్రీలీల రూ.2 కోట్లు తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.