వయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ వాద్రా బుధవారం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని తన నివాసం నుంచి కేరళలోని వయనాడ్‌కు బయలుదేరారు. సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ గాంధీ కూడా వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌లో గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు.