నటుడు కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు?

ప్రముఖ నటుడు కమల్ హాసన్ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేయనుందంటూ స్థానిక మీడియాలో కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కమల్ హాసన్ ఇంటికి మంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లడంతో స్థానికంగా ప్రచారం జరుగుతోంది.