నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

75చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు
మొయినాబాద్ మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలోని అజీజ్ నగర్ , నాగిరెడ్డిగూడ గ్రామాల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని మండల విద్యుత్ ఏఈ బానోతు హమునాయక్ తెలిపారు. విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంతో అజీజనగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నాగిరెడ్డిగూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12. 30 గంటల నుంచి 2. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్