78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శంకరపల్లి సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద గురువారం జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమము జరిగింది ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్ నరేష్ కుమార్ పతాకావిష్కరణ గావించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దేశభక్తుల చరిత్రలను చదివి వారి ఆశయాలను సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు. ప్రతిభారతీయుడు నా దేశము నా జెండా నినాదంతో ముందుకు సాగాలి అని కోరారు.