పార్టీల జెండాలు మోయడంలో ముందున్న బీసీలు ఎన్నికల వచ్చేసరికి కేవలం ఓటు బ్యాంకుగా మార్చబడిందని బీసీ నాయకులు కటకం నర్సింగ రావు అన్నారు. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాజ్యాధికారం - బీసీల చైతన్యం అంశంతో ఎల్బీ నగర్ నియోజకవర్గ బీసీ నాయకులు, బీసీ మేధావులతో స్వకుళశాలి భవన్ లో బీసీ కులసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.