ఆసుపత్రిలో చేరిన నటుడు దర్శన్
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి జైలు నుంచి మధ్యంతర బెయిలుపై విడుదలైన కన్నడ నటుడు దర్శన్ శుక్రవారం బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రిలో చేరారు. ఆయన వెంట తన భార్య లక్ష్మి కూడా ఉంది. దర్శన్ కొంత కాలంగా వెనునొప్పితో బాధపడుతున్నారట. కాగా, అక్టోబర్ 30న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు వైద్యపరమైన కారణాలతో ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.