వివేకా పీఏ వాంగ్మూలం తీసుకుంటున్న పోలీసులు
AP: కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇంటికి డీఎస్పీ మురళీనాయక్ వెళ్లారు. గతేడాది వివేకా కుమార్తె సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్‌పై పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి ఫిర్యాదు దాఖలు చేశారు. దాంతో ఆ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో భాగంగా పోలీసులు తాజాగా కృష్ణారెడ్డి వాంగ్మూలం తీసుకుంటున్నారు. కృష్ణారెడ్డి స్టేట్మెంట్, వాయిస్ రికార్డు చేస్తున్నారు.