శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి అక్కడి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ లో చేపడుతున్న పరీక్షల వివరాలను మందుల ఫార్మసీని పరిశీలించారు.