అందుబాటులోకి మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు: మంత్రి కొల్లు
AP: రాష్ట్రంలోని మద్యం షాపుల్లోకి త్వరలో మరిన్ని కొత్త బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రస్తుతం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తున్నామన్నారు. మద్యం ధరలు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఒక కమిటీ వేశామని, నివేదిక రాగానే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదన్నారు.