ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్సియల్ విధానాన్ని తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి కోడి ముందా గుడ్డు ముందా అన్న విధంగా మారిపోయిందని, సింగిల్ టీచర్ స్కూళ్లను తెరిపిస్తామని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి రాణించిన విద్యార్ధులకు సన్మానం చేసేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.