ఏపీలో వెలుగులోకి మరో స్కామ్
ఏపీలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చెత్త పన్ను వసూళ్లలో స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రశీదులు ఇవ్వకుండానే గతంలో అధికారులు చెత్త పన్ను వసూలు చేసినట్లు సమాచారం. కాగా, చెత్త సేకరణకు గతేడాది జూన్ నాటికి ప్రభుత్వం రూ.33.79 కోట్లు బకాయి పడింది.