షాద్ నగర్ లో వడదెబ్బతో యువకుడి మృతి

6743చూసినవారు
షాద్ నగర్ లో వడదెబ్బతో యువకుడి మృతి
షాద్ నగర్ పట్టణానికి చెందిన శ్రీనివాస మెడికల్ షాప్ యజమాని ఆకుల వెంకటేష్ గుప్తా కుమారుడు ఆకుల రాఘవేందర్ (39) వడదెబ్బకు అసువులు బాసాడు. నిన్న ఎండ వేడిమితో వడదెబ్బకు గురైన రాఘవేందర్ అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయాడు. శనివారం రాఘవేందర్ అంత్యక్రియలు జరుపనున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి అకాల మరణానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్