ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో పాలమూరు గొంతుకనై గర్జిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్సీగా నూతనంగా గెలుపొందిన నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ హాజరైనారు.