జాతి జాగృతికి, బడుగు బలహీన వర్గాల ఉద్దరణకు మహాత్మ జ్యోతిరావు పూలే అందించిన సేవలు మరువలేనివని బాతుక దేవేందర్ యాదవ్ అన్నారు. గురువారం షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావుపూలే వర్థంతిని మున్సిపల్ చైర్‌పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి బాతుక దేవేందర్ యాదవ్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.