Top 10 viral news 🔥
గోదావరి నదిలో గ్యాస్ లీక్.. భయంలో ప్రజలు (వీడియో)
గోదావరి నదిలో గ్యాస్ లీక్ అవుతున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యానాం దరియాలతిప్ప-కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఓఎన్జీసీ చమురు సంస్థ గోదావరిలో వేసిన పైపులైన్ నుంచి ఈ గ్యాస్ లీకైంది. గోదావరిలో సుడులు తిరుగుతూ.. నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి వస్తోంది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.