గతంలో మంకీపాక్స్ వ్యాధి జాడలు లేని కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి దేశాలు కూడా.. ఈసారి ఈ వ్యాధి బారిన పడ్డాయి. వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధి జంతువులతో ప్రత్యక్ష సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. ఉడుతలు వంటి చిన్న ప్రాణుల ద్వారా కూడా ఇది సోకుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే కొత్త వేరియంట్ మానవుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని చెప్పారు.