రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం: డిప్యూటీ సీఎం భట్టి

69చూసినవారు
రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం: డిప్యూటీ సీఎం భట్టి
ఈ ఏడాది హైదరాబాద్ లో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగిందని, ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక్క శనివారం రోజే 90 మిలియన్ యూనిట్లు దాటిందని చెప్పారు. గతేడాది ఇదే రోజున 59.98 యూనిట్లు మాత్రమే వాడకం జరిగిందని, దానితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం జరిగిందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్